సుపరిపాలన అందించే భాగ్యం కల్పించాలి

తిరుమల: కలియుగ దైవం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవెంటేశ్వరస్వామిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వై. విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డిని ఆలయ ఆర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనస్సు ఎరిగి సుపరిపాలన అందించే సత్తా ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని పాలించే విధంగా ఆశీర్వదించాలని స్వామివారిని కొరుకున్నట్లు చెప్పారు. మూడు దశాబ్దాల పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించే భాగ్యం కల్పించాలని కోరుకున్నానన్నారు. 
Back to Top