ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతా

విశాఖపట్టణం : ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న
పార్టీ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావంగా, విశాఖ ప్రజల సమస్యలను
మరింత లోతుగా అధ్యయనం చేయడానికి పార్లమెంటు సభ్యులు వి. విజయసాయిరెడ్డి బుధవారం
నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తొలుత మద్దెలపాలెంలోని పార్టీ కార్యాలయంలోనూ, అటు
తరువాత సంపత్ వినాయక దేవాలయంలో పూజలు నిర్వహించి అగనంపూడి వద్ద వైయస్
రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా
జరిగిన సభలో విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధికి తాను
ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను, కల్పించిన
హక్కులను అమలు చేయకుండా బిజెపి, టిడిపిలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను
మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. వీటి సాధన కోసం గత నాలుగు సంవత్సరాలుగా వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యకులు జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పోరాటాలు చేస్తున్న సంగతి
అందరికీ తెలిసిందే అని అన్నారు. 

విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి రాష్ట్రానికి 5
ఏళ్ల పాటుప్రత్యేక హోదాను ,విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వంటి ఎన్నో అంశాలపై
స్పష్టమైన హామీ ఇచ్చినా, వాటికి ఆచరణరూపం కల్పించడంలో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు
విఫలమయ్యాయన్నారు. అసలు వీటి అమలు కోసం ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదన్నారు.
రాష్ట్రానికి హోదా 15 ఏళ్లుకావాలంటూ ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు ప్రత్యేక ప్యాకేజి కోసం పూర్తిగా సరెండర్ అయ్యారని మండిపడ్డారు.

ఒక్క వైయస్ ఆర్ కాంగ్రెస్ మాత్రమే మొదటి నుంచీ
కూడా హోదా విషయంలో రాజీ పడకుండా, అది సంజీవిని అని, ప్రాణప్రదమని పేర్కొంటూ దాని
సాధన కోసం నిరంతరం పోరాడుతోందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడం, లోకసభ
సభ్యులు రాజీనామాలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదన్నారు. ఇలా అనేక
రకాలుగా పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా టిడిపికి పట్టడం లేదన్నారు

ఇలా హోదా కోసం పోరాడుతూనే  గత ఏడాది  జూలై జరిగిన పార్టీ  ప్లీనలో సమావేశాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి  హోదా, విభజన చట్టం హామీల అంశాల అమలు చేయడంతోపాటు,
మరింతగా అభివృద్ధి చెందడానికి రాష్ట్రంలో నవరత్నాలను అమలు చేస్తామంటూ పార్టీ
అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు
నాయుడు రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో నవరత్నాలను
ప్రకటించామన్నారు.

తన పాదయాత్ర సందర్భంగా నవరత్నాల
గురించి ప్రజలకు మరింతగా వివరిస్తానన్నారు. ఇప్పటికే వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, నవరత్నాల్లో చేయాల్సిన మార్పులపై
ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారని, ఆయనకు సంఘీభావంగా విశాఖ ప్రాంతంలో
తాను పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు
ఇచ్చిన 600 పైచిలుకు హామీలను అమలు చేయని వైనాన్ని, రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ
చేయకపోవడాన్ని , ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్న తీరును,
ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగారుస్తున్న వైనాన్ని ప్రజలకు వివరిస్తూ, వైయస్ జగన్
మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజా సంక్షేమానికి , అభివృద్ధికి ఏ విధంగా పెద్ద
పీట వేయనున్నారనే దానిని వివరించనున్నాని విజయసాయిరెడ్డి తెలిపారు. 

Back to Top