రాజ్యసభ ఎంపీగా సాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్ : ఏపీ వైయస్సార్సీపీ రాజ్యసభ ఎంపీగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి  సత్యనారాయణ ఈమేరకు ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. కాగా వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న తొలి ఎంపీగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు.

Back to Top