<br/> హైదరాబాద్: చంద్రబాబు నమ్ముకున్న మీడియా, నోట్ల కట్టలు తెలంగాణలో గెలిపించలేకపోయాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యవహారశైలి గురించి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) చక్కగా విశ్లేషించారని గుర్తు చేశారు. మీడియా, డబ్బుతో ఏదైనా చేయొచ్చన్న భ్రమలో ఏపీ సీఎం చంద్రబాబు ఉంటారని విమర్శించారు. ‘ప్రజలు మిమ్మల్ని చూస్తేనే భయపడుతుంటే మీడియా, మీరు నమ్ముకున్న నోట్ల కట్టలు గెలిపించలేవు అన్నారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెడినట్టు తెలంగాణ కాంగ్రెస్‌ను నిండా ముంచుతున్నాడు పెద్ద నాయుడు’ అంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.<br/>తమ పార్టీ 100 సీట్లు గెలుచుకుంటుందని కేటీఆర్ శనివారం విలేకరులతో అన్నారు. ‘కాంగ్రెస్ హేమాహేమీలు ఓడిపోనున్నా రు. ఇది ఖాయం. ఆ పార్టీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న వారు సొంత నియోజకవర్గాలు దాటలేదు. మేం ఫలితాల కోసం వేచి చూస్తున్నాం. 11న టీఆర్‌ఎస్ విజయోత్సవాలు జరుగుతాయి. ప్రజలు మావైపే ఉన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు వందలకోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నారు. అవన్నీ విఫలమయ్యాయి. గెలుపు సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు ముందుగానే సాకులు వెతుక్కుంటున్నారు. బాబు కూటమిలో చేరడం వల్ల ఓడిపోయామని ఫలితాల రోజు మాట్లాడేం దుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నార’ని కేటీఆర్ పేర్కొన్నారు.<br/><br/>