రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీః రాజ్యసభ సభ్యునిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వి.విజయసాయిరెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాజసభ్య చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయించారు. 

ఇటీవల రాజ్యసభకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వి. విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వైయస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తొలి అభ్యర్థిగా విజయసాయిరెడ్డి చరిత్ర సృష్టించారు.  
Back to Top