భన్వర్ లాల్ ను కలిసిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్ః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరో 15 రోజుల పాటు పొడిగించాలని ఆయన ఈ సందర్భంగా భన్వర్ లాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి ఓ వినతి పత్రం సమర్పించారు.
 
అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ... అర్హులైన వారిలో ఇప్పటివరకూ 50శాతం మంది కూడా ఓటర్లుగా నమోదు చేయించుకోలేదన‍్నారు. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని గడువు పొడిగించాలని ఆయన కోరారు. కాగా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీల ఓట్ల నమోదు ప్రక్రియ రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే.
 
Back to Top