నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ విజయప్రతాప్‌రెడ్డి

పోరుమామిళ్ల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్సీపీ తరఫున జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పోరుమామిళ్ల ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి బృందం ముమ్మరంగా ఇంటింటికి తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి కేటాయించిన 4 వ వార్డులో ఎంపీపీ బృందం ప్రచారం జోరుగా చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. నమూనా ఈవీఎం తీసుకుని ఓటర్లకు చూపుతూ వైయస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గుర్తు ఫ్యాన్‌పై ఓటు వేయాల్సిన విధానం గురించి ఎంపీపీ వివరించారు. ఆయన వెంట రవిప్రకాష్‌రెడ్డి, రమణ తదితరులు వున్నారు.

Back to Top