విజయనగరంలో వైయస్‌ఆర్‌సిపి రక్తదాన శిబిరం

విజయనగరం, 25 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం లయి‌న్సు కల్యాణ మండపంలో సోమవారంనాడు రక్తదాన శిబిరం జరిగింది. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 50 మంది పార్టీ యువకులు రక్తదానం చేశారు. విజయనగరం ఏరియా ఆస్పత్రిలో రక్తం నిల్వలు తక్కువగా ఉండటంతో పట్టణ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీలోని అన్ని విభాగాలూ చురుగ్గా పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవా కార్యక్రమాలు చేయాలన్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముందుండాలన్నది శ్రీ జగన్‌ ఆకాంక్ష అన్నారు. ఆ క్రమంలోనే విజయనగరంలో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.
Back to Top