వైయస్‌ జగన్‌ కోసం ఉత్తరాంధ్ర ప్రజల ఎదురుచూపు


అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎప్పుడు మా ప్రాంతానికి వస్తుందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గ నాయకులు పేర్కొన్నారు. బుధవారం వారు వైయస్‌ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రకటించిన 45 ఏళ్లకే పింఛన్‌ పథకానికి అనుహ్య స్పందన వస్తుందన్నారు.  ప్రతి ఇంట్లో కూడా 45 ఏళ్లు నిండిన వారు ఉన్నారని, వైయస్‌జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత తమకు పింఛన్‌వస్తుందని భావిస్తున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ను ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలా అని ఆరాటపడుతున్నారని చెప్పారు. 
 
Back to Top