ప్రజల ఆకాంక్ష మేరకే విజయమ్మ నిరశన దీక్ష

విజయవాడ‌ 15 ఆగస్టు 2103 :

రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్‌ విజయమ్మ విజయవాడలో ఈ నెల 19 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అంటూ దొంగ దీక్ష చేస్తే సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రమేష్‌ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా గతంలో టిడిపి లేఖ ఇచ్చిందని జోగి రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top