విజయమ్మను కలిసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

హైదరాబాద్ 14 ఫిబ్రవరి 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకున్న వాళ్ళంతా దర్జాగా బయట తిరుగుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీని వీడానని పేర్కొన్నారు. బుధవారం చంచల్‌గుడా జైలులో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన గురువారం ఉదయం లోటస్ పాండ్ కార్యాలయంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం  విలేకరులతో మాట్లాడారు.  రాజశేఖరరెడ్డిగారికి ముఖ్య అనుచరులుగా చెలామణీ అయిన వారే జగన్మోహన్ రెడ్డిగారికి అన్యాయం చేశారని చెప్పారు.

Back to Top