విజయమ్మకు అసెంబ్లీ తొలి వరుసలో సీటు

హైదరాబాద్,‌ 14 సెప్టెంబర్‌ 2012: శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ఆయా పార్టీల సీట్ల కేటాయింపులో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. సభలో ఈ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్ దీన్ని ఖరారు చేసిన తర్వాత సీట్ల కేటాయింపులో మార్పులు జరగనున్నాయి. 17 మంది ఎమ్మెల్యేలున్న వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికైన ఆ పార్టీ గౌ‌రవ అధ్యక్షురాలు విజయమ్మకు ప్రస్తుతం అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని అనుసరించి తొలి వరుసలో సీటు కేటాయిస్తారని అధికారులు తెలిపారు.

Back to Top