'విజయమ్మ దీక్ష వల్లే తగ్గిన భారం'

కాకినాడ, 08 ఏప్రిల్ 2013:

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేప్టిన దీక్ష  కారణంగానే  ప్రభుత్వం దిగివచ్చిందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెంచిన చార్జీలనుంచి రూ.800 కోట్ల భారం తగ్గిస్తూ చేసిన ప్రకటనే దీనికి ఆధారమన్నారు. శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో ఐదు రోజులపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ చేసిన కరెంట్ సత్యాగ్రహం దీక్ష విరమించిన అనంతరం ఆయన  సోమవారం ఉదయం కాకినాడ చేరుకున్నారు. ద్వారంపూడికి కార్యకర్తలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.

Back to Top