విజయమ్మ దీక్షకు బిసి సంఘం మద్దతు

ఏలూరు, 03 మార్చి 2013:

విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. విద్యత్తు చార్జీల పెంపుతో కులవృత్తులపై ఆధారపడినవారికి తీవ్రనష్టం వాటిల్లుతోందని జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు గంటా ప్రసాదరావు తెలిపారు. చార్జీలు తగ్గించకపోతే 5న సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Back to Top