పాలమూరు జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

కల్వకుర్తి 29 జూన్ 2013:

మహబూబ్ నగర్ జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్  విజయమ్మ శనివారం పర్యటించనున్నారు. కల్వకుర్తి మండలం కొట్ర సమీపంలో జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొంటారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమె  శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆమనగల్లు మండలంలోని కడ్తాల్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాళ్ల గణేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.  ఆనంతరం ఆమనగల్లులో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వెల్దండ మండలంలో రోడ్ షో నిర్వహిస్తారు. ఈ సదస్సుకు పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డితో పాటు ముఖ్య నేతలు కేకే మహేందరరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, కొండా సురేఖ, రెహ్మాన్, జిట్టా బాలకృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు,  రవీంద్రనాయక్ తదితర రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు.

Back to Top