ఆందోళనతో గుంటూరుకు విజయమ్మ..!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆందోళనకు గురయిన  కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరారు. ఏక్షణంలో ఏమవుతోందనన్న భయంతో ఉన్నారు. 

వైఎస్ఆర్సీపీ గౌరవఅధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ , ఇతర కుటుంబ సభ్యులు గుంటూరుకు పయనమయ్యారు, ఇంతకుముందు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి వైఎస్ జగన్ ను పరామర్శించారు. ఐతే, వైఎస్ జగన్ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. ఆయనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియక కుటుంబీకులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా దిగులు చెందుతున్నారు. 

ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చలించకపోవడంపై ప్రజలు, ప్రతిపక్షాల నేతలు  మండిపడుతున్నారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సన్నద్ధులై ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం  ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న జననేతపై... ప్రభుత్వం కక్షగట్టిన తీరును గమనిస్తున్నారు. పచ్చనేతలను తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top