రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ

హైదరాబాద్ 08 ఆగస్టు 2013:

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆమె గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.  సామరస్యానికీ, సుహృద్భావానికీ, సర్వమానవ సమత్వానికీ, కరుణకూ, దాతృత్వానికీ ప్రతీకని రంజాన్ పర్వదినం ఆమె అందులో వ్యాఖ్యానించారు. మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని తెలిపారు. రంజాన్ మాసంలోనే ఈ పండుగ రావడం మరో ప్రత్యేకతని పేర్కొన్నారు. నెలరోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడడం రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని శ్రీమతి విజయమ్మ ఆ ప్రకటనలో వివరించారు.

Back to Top