నావికుల మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్ 16 ఆగస్టు 2013:

సింధు రక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో భారత నావికా దళానికి చెందిన 18మంది మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకించి ఈ దుర్ఘటనలో అసువులు బాసిన విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు యువ నావికులు తూతిక రాజేశ్, దాసరి దుర్గాప్రసాద్ కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతినీ తెలియజేశారు.  భారత నావికా దళంలో నావికులుగా పనిచేస్తూ దేశ సేవలో నిమగ్నమై ఉన్న ఈ యువకుల మృతితో వారి కుటుంబాలకే కాక, దేశానికి కూడా తీరని నష్టం వాటిల్లిందని ఆమె తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఈ పెను విషాదాన్ని ఎదుర్కొనడానికి వారి కుటుంబాలకు తగినంత ఆత్మ స్థైర్యాన్ని ప్రసాదించాలని శ్రీమతి విజయమ్మ ప్రార్థించారు.

తాజా ఫోటోలు

Back to Top