మాలతీ చందూర్ మృతికి విజయమ్మ సంతాపం

గుంటూరు 21 ఆగస్టు 2013:

ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సంతాపం తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి చందూర్ మూడు దశాబ్దాలకు పైగా తన రచనల ద్వారా తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె పేర్కొన్నారు. సాహితీ లోకానికి ఆమె మృతి తీరని లోటని తెలిపారు. వివిధ పత్రికలలో ప్రచురితమైన శ్రీమతి చందూర్ రచనలు తెలుగు ప్రజలకు విజ్ఞానాన్ని పంచాయని పేర్కొన్నారు. కొన్ని తరాలపాటు ఆమె రచనలు ఈ రాష్ట్రంలో పాఠకుల ఆలోచనా ధోరణిని ప్రభావితం చేశాయన్నారు. చందూర్ కుంటుంబానికి శ్రీమతి విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top