అనాధాశ్ర‌మంలో విజ‌య‌మ్మ బ‌ర్త్‌డే

ఉరవకొండ: వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయ‌స్ విజయమ్మ పుట్టిన‌రోజు వేడుక‌ను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విఠల్ రుక్మిణీ వృద్ధ అనాధ ఆశ్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ అధ్వర్యంలో అనాధ, వృద్ధుల చేత కేక్‌ను కట్‌చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, జడ్‌పీటీసీ లలితమ్మలు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వైయ‌స్‌ఆర్ సీపీ ఆవిర్భ‌వించిందని తెలిపారు. పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిను అన్నీ రకాలుగా తోడుగా వుంటూ వైయ‌స్ విజయమ్మ పార్టీకి పెద్ద దిక్కుగా మారారని తెలిపారు. 2019లో పార్టీ అధికారం చేజిక్కుంచుకోవడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 
Back to Top