ప్రభుత్వమే హోదా ఇవ్వాలి: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ) కేంద్ర
ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉన్నందున, వెంటనే నిర్ణయం తీసుకోవాలని
వైయస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా
కల్పించేందుకు కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు
చేశారు. ప్రత్యేక హోదా మీద చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకొని తమ వైఖరి
వినిపించారు. సూటిగా రెండు విషయాలు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియపరుస్తున్నట్లు
విజయసాయిరెడ్డి వెల్లడించారు. “ఆర్టికల్ 280 గురించి ప్రస్తావించారు. దాని ప్రకారం 14వ ఆర్థిక సంఘం ఇచ్చినవి కేవలం సూచనలు
మాత్రమే. దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక
హోదా ఇ‍వ్వాలా, వద్దా అని నిర్ణయించవలసింది ప్రభుత్వమే. ఇప్పటివరకు ఇచ్చిన 11 రాష్ట్రాలన్నింటికీ ప్రభుత్వ నిర్ణయంతోనే ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర మంత్రిమండలి 2014వ
సంవత్సరం మార్చి 1న తీర్మానం చేసింది. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం
మీద ఉంది'అని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇప్పటికే ప్రత్యేక హోదా కు సంబంధించి విజయసాయిరెడ్డి పార్టీ వైఖరిని రాజ్యసభ ద్రష్టికి తీసుకొని వచ్చారు. వాదనల్ని విజయవంతంగా వినిపించారు. ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నది వైయస్సార్సీపీ మాత్రమే అని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇక ముందు కూడా తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు. 

తాజా వీడియోలు

Back to Top