విజయసాయిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్) వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కి త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాల్గొనే ధర్నా కు హాజరు అయ్యేందుకు ఆయన ఉదయం బయలు దేరారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఓటర్ రింగ్ రోడ్డులో ప్రయాణిస్తుండగా రాజేంద్రనగర్ సమీపంలో కారు బోల్తా కొట్టింది. వాహనంలో విజయసాయిరెడ్డి తో పాటు ఉన్న ఇద్దరు పార్టీ నాయకులు, డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనంలో భద్రత చర్యలు తీసుకోవటంతో పెద్ద ప్రమాదం కలగకుండా బయట పడ్డారు. ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సను అందిస్తున్నారు. వైయస్సార్సీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని ఆయన్ని పరామర్శించారు.


To read this article in English: http://bit.ly/279Fnns

Back to Top