విజయారెడ్డి విజయం తథ్యం: విజయమ్మ

హైదరాబాద్ :

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పి. విజ‌యారెడ్డి అత్యధిక మెజారిటీలో విజయం సాధించడం తథ్యమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజ‌యమ్మ ధీమాగా చెప్పారు. ఖైరతాబాద్‌ నుంచి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసిన విజ‌యారెడ్డికి మద్దతుగా శ్రీమతి విజయమ్మ వచ్చారు.

విజయారెడ్డి నామినేషన్‌ వేసని అనంతరం శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇంకా మరచిపోలేద‌న్నారు. పీజేఆర్ వారసురాలిగా‌ ఎన్నికల బరిలోకి వస్తున్న విజయారెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదే‌శ్‌లోనూ వైయస్ఆర్‌సీపీ జయకేతనం ఎగురవేస్తుందని శ్రీమతి విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం తాను ప్రచారం చేస్తానని ఆమె తెలిపారు.

Back to Top