చంద్ర‌బాబును న‌మ్మే ప‌రిస్థితి లేదు

విశాఖపట్నం: టీడీపీ అలీబాబా దొంగల పార్టీ అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు విజయ్‌ చందర్‌ అభివర్ణించారు. విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సీఎంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్‌ రెడ్డి పాలన చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు మితిమీరిపోతున్నాయని, ఆయనని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ ప్రజలు నష్టపోయారని వెల్లడించారు. బ్రిటీషర్లను ఎదిరించిన చరిత్ర తెలుగు జాతిదని అని చెప్పారు. చంద్రబాబు మోసాలను గమనించి అదే రీతిన దెబ్బ కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.


తాజా ఫోటోలు

Back to Top