రికార్డు తిరగేసి చూడండి బాబు

()అధికారపార్టీ శాసనసభను తప్పుదోవ పట్టిస్తోంది
()వైఎస్సార్ ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇచ్చేందుకు..
 రాత్రివరకు కూడా సభను కొనసాగించారు
అసెంబ్లీః బీఏసీ సమావేశంలో గవర్నర్ ప్రసంగం మీద రెండు రోజులు ధన్యవాద ప్రసంగం ఉంటుందని చెప్పిన అధికార పార్టీ నేతలు... ఇప్పుడు మాట మార్చడం దారుణమని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నేత ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. బీఏసీలో ఇందుకు సంబంధించిన అజెండా పేపర్ కూడా ఇచ్చారని చెప్పారు. అధికారపార్టీ శాసనసభను తప్పుదోవ పట్టించే విధానం దేనికోసం చేస్తుందని జ్యోతుల ప్రశ్నించారు. సమయం సర్దుకుందామంటే...ఏవిధంగా సర్దుకోవాలో ఆలోచన చేద్దాం, అంతేగానీ తప్పుడు మాటలు మాట్లాడవద్దన్నారు. బీఏసీలో ప్రస్తావనకు రాని అంశాల్ని సభలో చెప్పడం తమపై అపవాదు వేయడమేనని ఫైరయ్యారు. 

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకటిన్నరకు సభ మూసేస్తారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశం వచ్చేవిధంగా వైఎస్సార్  రాత్రి తొమ్మిదన్నర వరకు కూడా ఎన్నోసార్లు సభను కొనసాగించారన్నారు. మధ్యాహ్నం ఎన్నిసార్లు సభ జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో , సంవత్సర కాలంలో ఎన్నిసార్లు సభ జరిగిందన్న దానిపై టీడీపీ నేతలు రికార్డ్ లు తిరిగేసి చూసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. 
Back to Top