'విద్యుత్‌ ఉద్యమం చేసే హక్కు బాబుకు లేదు'

గుంటూరు, 1 ఏప్రిల్‌ 2013:‌ ముగ్గురు విద్యుత్ ఉద్యమకారులను కాల్పుల్లో చంపించిన చంద్రబాబు నాయుడికి విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరాటం చేసే నైతిక హక్కు లేదని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం సందర్భంగా బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించి ముగ్గురి మరణానికి ఆయన కారణమయ్యారని గుర్తుచేశారు. అప్పుడు ప్రాణాలు తీయించి ఇప్పుడు విద్యుత్‌ చార్జీల పెంపెపై ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదం అని అంబటి వ్యాఖ్యానించారు.
Back to Top