విద్యుత్తు చార్జీల పెంపు తగదు

నిర్మల్:

విద్యుత్తు చార్జీల పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం అమానుషమని మాజీ ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్  నాయకుడు ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే సర్చార్జీలతో ప్రజలు అదనపు భారం మోస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు వేల కోట్లలో విద్యుత్తు బిల్లులు పెంచడం సరైంది కాదన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో విద్యుత్తు బిల్లులు పెరగలేదన్నారు. కిరణ్ సర్కార్ ఎడాపెడా కోతలు విధిస్తుండడంతో రైతులు పంట పొలాలకు నీరు పెట్టలేని దుస్థితి దాపురించిందన్నారు. గ్రామాల్లో రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top