విద్యుత్‌ సమస్యలపై వైయస్‌ఆర్‌సిపి ధర్నా

ధన్వాడ (మహబూబ్‌నగర్‌ జిల్లా), 5 జనవరి 2013: విద్యుత్‌ సమస్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమించింది. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూ‌బ్‌నగర్ జిల్లా‌లో పార్టీ కార్యకర్తలు శనివారంనాడు ధర్నా నిర్వహించి, ఆందోళన చేశారు. పాలమూరు జిల్లాలో ధన్వాడ మండలం మరికల్‌లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఈ ఆందోళన నిర్వహించింది. ఈ ధర్నాకు రెడ్డిగారి రవీందర్‌రెడ్డి నాయకత్వం వహించారు. రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ సమస్య‌లను తక్షణమే పరిష్కరించాలని ఈ ధర్నా సందర్భంగా వైయస్‌ఆర్‌సిపి నాయకులు, శ్రేణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా, నిరసనతో రాయిచూర్- మహబూ‌బ్‌నగర్ రహదారిపై వాహనాల రాకపోక‌లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
Back to Top