'విద్యుత్‌'పై పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

హైదరాబాద్, 3 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను‌ తక్షణమే తగ్గించాల‌న్న డిమాండ్‌తో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నది. ఈ ఆందోళనల్లో నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకుదు ఆదం విజయ్ కుమా‌ర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో‌ భారీ ర్యాలీ నిర్వహించారు. సీతాఫల్‌మండి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో విజయారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సిఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఇతన నాయకుల ఆధ్వర్యంలో లాంతర్లతో ధర్నా నిర్వహించారు. తిరుపతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ధర్నా చేశారు. 
తిరుపతి మంగళం విద్యుత్ ఉపకేంద్రం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ యువజన విభాగం ‌నాయకులు దీక్ష చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో పార్టీ నాయకుడు జ్యేష్ట రమేష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గుంటూరు జిల్లా క్రోసూరులో విద్యుత్ ‌ఛార్జీలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు. అదే జిల్లా మార్కాపురంలో ధర్నా చేశారు.

వరంగల్ జిల్లా వర్దన్నపేటలో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు ఆందోళన చేశారు. ఏటూరునాగారంలో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. డోర్నకల్‌లో మహాధర్నా నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్లో ధర్నా చేశారు.‌ నల్గొండలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ ‌బీరవోలు సోమిరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా హాలియాలో రాస్తారోకో, ధర్నా చేశారు. చండూరులో పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. మెద‌క్ జిల్లా సంగారెడ్డిలో ‌పార్టీ నాయకులు‌ విద్యుత్ ఎస్ఈ కార్యాల‌యాన్ని ముట్టడించారు. సిద్దిపేటలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోల్ మండలం అన్నాసాగ‌ర్ స‌బ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. పటా‌న్చెరు మండలం ఇస్నాపూ‌ర్లో పార్టీ ‌నాయకులు మహీపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ స‌బ్స్టేష‌న్ ముట్టడించారు.

‌ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పువ్వాడ అజ‌య్ కుమా‌ర్, పొంగులేటి శ్రీనివా‌స్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వైరాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు బొర్రా రాజా, జైపాల్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. నిజామాబా‌ద్ కలెక్టరేట్ వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. నిజామాబా‌ద్ జిల్లా ఎల్లారెడ్డిలో సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో స‌బ్‌స్టేషన్ ముట్టడించారు. బిచ్కుందలో ‌పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు లాంతర్లతో ధర్నా చేశారు.

వైయస్‌ఆర్ జిల్లా కడప కలెక్టరే‌ట్ ఎదుట వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ జిల్లా కన్వీన‌ర్ సురే‌ష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రొద్దుటూరులో ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వి.ఆర్. రామిరెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్సుకో కార్యాలయం ఎదుట మహాధర్నా చేశారు. కదిరిలో పార్టీ కార్యకర్తలు సిఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
Back to Top