‌'విద్యుత్ కొరత తీర్చింది మహానేత వైయస్'

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న విద్యు‌త్ కొరతను‌ తీర్చింది దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌అని ఎ.పి. జెన్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ప్రభాక‌ర్‌రావు గుర్తుచేశారు. పవర్ ప్రాజెక్టుల ద్వారా విద్యు‌త్‌ను స్వయం ఉత్పత్తి చేయడం ద్వరా ఆయన విద్యుత్ కొరతను ‌అధిగమించగలిగారన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థలకు‌ మహానేత వైయస్ పెద్దపీట వేశార‌న్నారు. అందుకే రైతులు, పరిశ్రమలకు సరిపడినంత విద్యుత్‌ను అందజేయగలిగామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం వైయస్‌ఆర్ విద్యు‌త్ ఎంప్లా‌యీస్ యూనియ‌న్‌ -2013 డైరీని ప్రభాకర్‌రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, ట్రాన్సుకో, జెన్‌కోల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వై‌యస్‌ఆర్ క్రమబద్ధీకరించిన విషయాన్నిగుర్తుచేశారు. విద్యుత్ రంగ‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంఘంగా ఏర్పడటాన్ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి వైయస్‌ఆర్ ట్రే‌డ్ యూనియ‌న్ నాయకుడు బి.జన‌క్ ప్రసా‌ద్ మాట్లాడుతూ‌,‌ మహానేత వైయస్ మరణించిని తరువాత కార్మికలోకం డోలాయమానంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఎ.పి. ట్రాన్సుకో ఎనర్జీకార్డు సెల్ సభ్యుడు ఎ.చంద్రశేఖ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రజాసంక్షేమం కోసం వైయస్ ‌పలు పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆర్థిక పరమైన సమస్యలకు ఆ మహానేత పరిష్కారం చూపారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ‌నల్లా సూర్యప్రకా‌ష్, వైయస్‌ఆర్‌ ట్రేడ్ యూనియ‌న్ ప్రధాన కార్యదర్శి రవీంద‌ర్‌రెడ్డి, కోశాధికారి పి.మాధవరెడ్డి, వైయస్‌ఆర్ విద్యు‌త్ ఎంప్లా‌యీస్ యూనియ‌న్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరావు, అదనపు ప్రధాన కార్యదర్శి సురే‌ష్ కాంతారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.మహేశ్వ‌ర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు వైయస్‌ఆర్ విద్యు‌త్ ఎంప్లా‌యీస్ యూనియ‌న్ లోగో, వా‌ల్ క్యాలెండ‌ర్, టేబు‌ల్ క్యాలెండ‌ర్, కాంట్రాక్టు వర్క‌ర్సు యూనియన్ క్యాలెండర్లను అతిథులు ఆవిష్కరించారు.

తాజా ఫోటోలు

Back to Top