'విద్యుత్‌ చార్జీల'పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ర్యాలీ

‌హైదరాబాద్, 8 ఏప్రిల్‌ 2013: విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉద్యమాలు ఊపందుకున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు సోమవారంనాడు ర్యాలీ నిర్వహించారు. కరెంట్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా మంగళవారం నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలంటూ కంటోన్మెంట్‌ ప్రజలకు ఈ ర్యాలీ సందర్భంగా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జంపన ప్రతాప్‌, వెంకట్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించారు.
Back to Top