షర్మిల సమైక్య శంఖారావానికి జనం నీరాజనం

అనంతపురం, 4 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌కుమార్తె శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. శ్రీమతి షర్మిల బుధవారంనాడు అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మహానేత కుటుంబంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు ఈ జన నీరాజనమే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ‌ శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రను ఈ నెల 2వ తేదీన తిరుపతిలో ప్రారంభించారు.

తాజా వీడియోలు

Back to Top