రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుః వేణుగోపాలకృష్ణ

హైదరాబాద్ః చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను పక్కదేశాలకు, రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలన్నా, దేవుడన్నా చంద్రబాబుకు భయం, భక్తి ఏమాత్రం లేవన్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాడరు, పక్కరాష్ట్రాలతో పోరాడరు గానీ ప్రతిపక్షంపైన మాత్రం బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో బాబు ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

తాజా ఫోటోలు

Back to Top