బాబుకు ఓటేసిన పాపానికి..?

 • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
 • నిధుల మంజూరులో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల వివక్ష
 • అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోళ్లు 
 • అధికార దుర్వినియోగానికి పరాకాష్ట బాబు పరిపాలన
 •  ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా బాబు నిర్ణయాలు
 • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వేణుగోపాలకృష్ణ

 • హైదరాబాద్ః చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరు చేయడంలో చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పంచన చేరిన వారికి మాత్రమే నిధులు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. బాబుకు ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు ఘోషిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులు తలదించుకునేలా బాబు పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. 

  ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీడీపీలోకి రాకపోతే వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగనివ్వనంటూ చంద్రబాబు ప్రతిన బూనడం దుర్మార్గమని వేణుగోపాల కృష్ణ ఫైరయ్యారు. ఈవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వ్యక్తిగా  చంద్రబాబు చరిత్రలోకి ఎక్కారని ఎద్దేవా చేశారు. అందుకు  ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియలే ఉదాహరణ అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి  వైయస్సార్సీపీ లో పనిచేసినప్పుడు....టీడీపీ నేత రామసుబ్బారెడ్డి పేరిట నిధులు మంజూరు చేశారు.  ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్లాక ఆయన పేరిట నిధులు మంజూరు చేశారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ  వైయస్సార్సీపీలో పనిచేసినప్పుడు  టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డి పేరున నిధులు మంజూరు చేశారు.  టీడీపీ పంచన చేరాక ఆమె పేరిట నిధులు మంజూరు చేశారు. 

  ఇది ప్రజాస్వామ్యమా...? ప్రజలు ఎవరినైతే ప్రతినిధులుగా పంపిస్తున్నారో వారికి నిధులు మంజూరు చేయకుండా...బాబు తనకు వత్తాసు పలికే వారికి మాత్రమే మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని వేణుగోపాలకృష్ణ నిలదీశారు. వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు  నిధులు మంజూరులో వివక్ష చూపించడం దారుణమని ఆయన ఫైరయ్యారు.  ప్రజాస్వామ్య విలువలకు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట చంద్రబాబు పరిపాలన అని వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుక్కోవడమంత దుర్మార్గం మరొకటి ఉండదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన అధికారాల్ని తుంగలో తొక్కడం  హేయనీయమన్నారు. గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ...ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయని వేణుగోపాలకృష్ణ ఫైరయ్యారు. 


Back to Top