బాబు 480మందిని పొట్టనబెట్టుకున్నారు

నంద్యాల: వందలాది హత్యలు చేయించిన చంద్రబాబు నాయుడు.. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో నీతులు వల్లించడం హాస్యాస్పదమని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. బాబు మోసాలు, అక్రమాలు, అబద్ధాల గురించి ప్రజలకు బాగా తెలుసని, ఉప ఎన్నిక ద్వారా ఖర్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు. ఆదివారం నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ఐఏఎస్‌ రాఘవేంద్రరావు, కాపునేత వంగవీటి రంగా, జర్నలిస్ట్‌ పింగళి దశరథ్‌.. ఇలా ఇద్దరు ముగ్గురు కాదు మొత్తం 480 మందిని హత్యచేయించిన ఘనత చంద్రబాబుది. మర్డర్లు చేయించే ఆయనే ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తారు. అలాంటాయన నంద్యాలకు వచ్చి నీతులు వల్లిస్తున్నారు. ఉప ఎన్నికలో ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారు’ అని ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Back to Top