వెంకయ్య, బాబు అవిభక్త కవలలు

హైదరాబాద్‌: తెలుగు నాట చంద్రబాబు, వెంకయ్యనాయుడు అవిభక్త కవలల మాదిరిగా
వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో పది సంవత్సరాలు ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన
వెంకయ్య,
చంద్రబాబులు
హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్
లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 

ప్రత్యేక హోదా మీద అదేపనిగా మోసాలు

ప్రత్యేక హోదాను ఆర్పే ప్రయత్నం చేస్తున్న తెలుగువారైన వెంకయ్యనాయుడు, చంద్రబాబు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
విమర్శించారు  రెండున్నర సంవత్సరాల క్రితం
ప్రత్యేక హోదా సంజీవని అని హోదాను ఇచ్చి తీరుతాం.. సాధించి తీరుతాం అని
అధికారంలోకి వచ్చిన బీజేపీ,
టీడీపీలు ఏపీ
ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై
భూమన విరుచుకుపడ్డారు. ఏపీకి హోదా కేటాయింపులో అనేక రాష్ట్రాల ప్రతినిధులు
అడ్డుపడడంతో ఆ రోజే మనస్సు మార్చుకున్నానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సన్మానాలు
చేయించుకొని మరీ చెబుతున్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో విశాఖలో బీజేపీ మ్యానిఫెస్టో
పది సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పిన మాటలు గుర్తులేదా అని వెంకయ్యను సూటిగా
ప్రశ్నించారు. నాలాంటి అనుభవజ్ఞుడు అధికారంలోకి వస్తేనే హోదా సాధించగలడని బీరాలు
పలికిన చంద్రబాబు నాయుడు హోదా సాధనలో అనుభవం ఏమైందని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం, నీతి అయోగ్, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని హోదా
సంజీవనని నీరుగారుస్తున్నారని ఫైరయ్యారు. ఏపీకి రెవెన్యూ లోటు రూ. 22 వేల కోట్లు ఇస్తున్నాం కాబట్టి హోదా ఇచ్చే
పరిస్థితి లేదని వెంకయ్య వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. హోదా లబ్దిని గుర్తించి
తెలుగు జాతి ఏకమై పోరాడుతుంటే ప్యాకేజీ అంటూ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
తెలుగుజాతి ద్రోహులైన అవిభక్త కవలలు వెంకయ్య, చంద్రబాబుల శరీరాలు వేరైనా ఆడే అబద్దాలు
మాత్రం ఒక్కటేనని ఎద్దేవా చేశారు.

హోదా ఎందుకు సాధించటం లేదు

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్న
హోదాకు తేడాలేదంటున్న వెంకయ్య.. దానికి దీనికి తేడా లేనప్పుడు హోదానే ఇవ్వొచ్చుగా
అని భూమన ధ్వజమెత్తారు. ఎన్నికల మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజలను వంచించిన ద్వయం
దిగ్గజాలు బాబు,
వెంకయ్య ఇద్దరూ
ఎందుకు హోదా సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. గత కొన్ని రోజుల క్రితం రిజర్వ్‌
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టంగా ఉమ్మడి ఏపీకి రూ. 32 వేల కోట్లు ప్రకటిస్తే హోదా కల్గిన
రాష్ట్రాలకు రూ. 91,980 కోట్లు కేటాయించిందన్నారు. దాదాపు ఐదున్నర
కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికంటే ఏడున్నర కోట్ల జనాభా కల్గిన రాష్ట్రాలకు మూడు
రెట్లు ఎక్కువగా నిధులు విడుదల చేసిందని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామం రోజుల్లో
మనల్ని పాలించే బ్రిటీష్‌వారు స్వాతంత్య్రం కంటే ఎక్కువ లాభం ఇస్తామని ఉంటే
పోరాటాన్ని మానుకునే వాళ్లా? అని ఇద్దరు నాయుళ్లను నిలదీశారు. ప్రాణాలకు తెగించి అమరవీరులు దేశానికి
స్వాతంత్య్ర సంపాదిస్తే వీరిద్దరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు
సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు హోదా కోసం ఉద్యమాలు చేస్తుంటే బాబు, వెంకయ్యలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ
మేలంటూ ఊరేగింపులు,
సన్మానాలు
చేయించుకుంటున్నారని మండిపడ్డారు.

వెంకయ్యవి చౌకబారు మాటలు

ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని
పిల్లకాంగ్రెస్‌ అని మాట్లాడిన వెంకయ్య చౌకబారు మాటలను భూమన తీవ్రంగా ఖండించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి వెంకయ్యకు ఇలాంటి చిల్లర మాటలు తగునా అని
నిలదీశారు. చిల్లర స్థాయి నాయకుడిగా ఉన్నా వెంకయ్యను బీజేపీ జాతీయ నేతగా
కీర్తిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని చురకంటించారు. ఏపీకి హోదా అవసరం లేదని
ప్రధానమంత్రి మోడీ చెప్పకపోయినా తెలుగువాడైన వెంకయ్యనాయుడు పదేపదే ఇవ్వబోమని
చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రం నుంచి ఎన్నికయ్యానని ఏపీ
ప్రయోజనాలను సర్వనాశనం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం నుంచి
ప్రతినిధిగా లేనప్పుడు 3 రోజులకు ఒకసారి ఎందుకు ఏపీలో పర్యటనలు
చేస్తున్నారని భూమన విరుచుకుపడ్డారు. 

బాబుది కమీషన్ల ఆరాటం

బీజేపీలో కేంద్రమంత్రిగా ఉంటూ చంద్రబాబు పార్టీకి కార్యకర్తగా
వ్యవహరిస్తున్నారని భూమన విమర్శించారు. టీడీపీ నేతలు కూడా పొగడనంతగా వెంకయ్య
బాబును పొగుడ్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఇంటి ప్రయోజనం కోసం పోరాటం
చేస్తుంటే సీఎం చంద్రబాబు తన కమీషన్లు, తాబేదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని
భూమన ధ్వజమెత్తారు. హోదా ఇవ్వొద్దని పార్లమెంట్‌లో ఏ పార్టీ అభ్యంతరం
చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ నేత కేవీపీ పెట్టిన ప్రైవేట్‌ బిల్లుకు కూడా రాజ్యసభలో
13 పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు.
అన్ని వనరులున్న ఏపీకి హోదా ఇస్తే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తోందన్న
కుట్రతోనే ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోసం ఏరకంగా పోరాటం
జరిగిందో అంతకంటే ఎక్కవగా ప్రజా సంఘాల మద్దతుతో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి
నేతృత్వంలో హోదా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top