మాజీ కౌన్సిలర్‌ మారెన్నకు ప‌రామ‌ర్శ

గుంతకల్లు :  అనారోగ్యంతో బాధపడుతున్న 14వ వార్డు మాజీ కౌన్సిలర్, బుడగ జంగాల  సంఘం రాష్ట్ర నేత కథల మారెన్నను వైయ‌స్ఆర్‌సీపీ  సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి పరామర్శించారు. సోమవారం మారెన్న నివాసానికి వెళ్లిన వైవీఆర్‌ ఆయన ఆరోగ్య, యోగక్షేమాలను అడిగి తెలుసుకుని మనోధైర్యాన్నిచ్చారు.ఆయ‌న‌తో పాటు వార్డు మాజీ కౌన్సిలర్‌ ఎం.రాజశేఖర్, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వై.సుధాకర్, స్థానిక నాయకులు అరుణమ్మ, గంగమ్మ, మల్లికార్జున, రమేష్, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top