సుంకం తొలగింపు హర్షణీయం

కంకిపాడు: పప్పుధాన్యాలపై సుంకం తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని వైయస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాకర్ల వెంకటరత్నం అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పెసర పప్పు, కందిపప్పు, మినపప్పుపై సుంకం తొలగించటం వల్ల ఎగుమతులుకు అవకాశం ఉంటుందన్నారు. మార్కెట్‌లో పప్పుధాన్యాలకు ధర ఆశాజనకంగా ఉండటంతో అవి పండించే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

తాజా ఫోటోలు

Back to Top