మీరు ఏ పార్టీ ప్ర‌తినిధి వెంకయ్య జీ!

హైద‌రాబాద్: కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు, ప్ర‌క‌ట‌న‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. కేంద్ర మంత్రిగా, సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌గా ఉన్న ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటు సాక్షిగా అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌నిప్ర‌క‌టించారు. దీనిపై స్పందించిన వెంక‌య్య నాయుడు ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా కావాల‌ని చెప్పారు. దీన్ని టీడీపీ-బీజేపీ ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. కానీ, అధికారంలోకి వ‌చ్చాక నిబంధ‌న‌లు, నియ‌మాలు అంటూ కేంద్రం జాప్యం చేస్తూ వ‌స్తోంది. అప్పుడు అన్నీ తెలిసిన వెంక‌య్య నాయుడు ప‌దేళ్ల కోసం ప‌ట్టు ప‌ట్టి, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా గురించి ఏమీ మాట్లాడ‌క పోవటాన్ని అంతా త‌ప్పు ప‌డుతున్నారు. అసలు ఈ 15 నెల‌ల కాలంలో వెంక‌య్య నాయుడు రాష్ట్రానికి ఏం తెచ్చారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏపీకీ పెద్ద దిక్కు అని చెప్పుకోనే ముందు ఈ విష‌యాలు ఆలోచించాల‌న్న మాట వినిపిస్తోంది. 

ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు తెలుగు ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ప‌దే ప‌దే చంద్ర‌బాబు నాయుడుని వెన‌కేసుకొని రావ‌టం, రాష్ట్రంలో చంద్ర‌బాబుని ఆకాశానికి ఎత్తేయ‌టంపై విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త సంబంధాలు ఉండ‌వ‌చ్చు కానీ, అంత‌మాత్రాన టీడీపీ ప్ర‌తినిధిలా మాట్లాడ‌టం స‌రికాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. 
Back to Top