వేమిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం

 అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండో రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే ఆల‌స్యం. మంగళవారం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి తన నామినేషన్‌ను ఉప సంహకరించుకున్నారు. ఈ మేరకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా 15వ తేదీన ప్రకటించనున్నారు.  ఏపీ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని వైయ‌స్ జ‌గ‌న్ ఎంపిక చేసి ఇటీవ‌ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న ఈ నెల 7వ తేదీన  నామినేషన్ దాఖలు చేశారు. నామినేష‌న్ అనంత‌రం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంతో త‌న‌కు 40 ఏళ్ల అనుబంధం ఉంద‌ని, వైయ‌స్‌ జగన్ తనకు మంచి గౌరవం ఇచ్చారని చెప్పారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎంపిక‌తో రాజ్య‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీకి ఇద్ద‌రు ఎంపీలు అవుతారు. ఇప్ప‌టికే విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేస్తున్నారు. ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎన్నిక‌తో పార్టీ బ‌లం పెద్ద‌ల స‌భ‌లో పెరుగుతుంది. ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎన్నిక ప‌ట్ల పార్టీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


Back to Top