వ్యవస్థలను మ్యానేజ్‌ చేయడం తప్ప బాబు చేసింది ఏమీ లేదు
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవస్థలను మ్యానేజ్‌ చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషస్పందన వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు మోసాలు బట్టబయలు అవుతున్నాయన్నారు. పొద్దునే మహిళలు, నిరుద్యోగులు పంట పొలాల నుంచి పరుగెత్తుకొని వచ్చి వైయస్‌ జగన్‌కు తమ బాధలు చెప్పుకుంటున్న దృశ్యాలు చూస్తే  బాధనిపిస్తుంది. చంద్రబాబు లక్షల పింఛన్లు ఇచ్చామని, రుణాలు మాఫీ చేశామని చెప్పుకుంటున్నారని,  క్షేత్రస్థాయికి వస్తే ఆయన చేసింది ఏంటో అర్థమవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో సమస్యలు వెల్లువలా వస్తున్నాయని, ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లంపల్లి తెలిపారు.
 
Back to Top