ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టిన ఘనుడు కేశినేని

విజయవాడః వైయస్సార్సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ జగన్ ను విమర్శించే అర్హత కేశినేని నానికి లేదని అన్నారు. ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టిన ఘనుడు కేశినాని నాని అని నిప్పులు చెరిగారు. మెజార్టీ సాధిస్తామని చెబుతున్నారని...అసలు ముందు మీ పార్టీ నీకు సీటు ఇస్తుందో లేదో అది చూసుకోవాలని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వప్రయోజనాల కోసం కేశినేని రాజకీయాలు చేస్తున్నారని  వెల్లంపల్లి దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top