వెల్లమిల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర

వెల్లమిల్లి(తాడేపల్లిగూడెం) 21 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన  పాదయాత్రను మంగళవారం నాడు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెల్లమిల్లి నుంచి  ప్రారంభించారు. రాజన్న తనయకు మద్దతుగా అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. పెద్దతాడిపల్లి, టిపి గూడెం - గొల్లగూడెం సెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, తాలూకా ఆఫీస్‌ సెంటర్‌ మీదుగా పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర సాగుతుంది. పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారు. ఆ తర్వాత జయలక్ష్మీ టాకీస్‌ మీదుగా ముదునూరుపాడుకు చేరుకొని రాత్రి బస చేస్తారు.

Back to Top