వీరులపాడు నుంచి షర్మిల నేటి పాదయాత్ర

వీరులపాడు (కృష్ణాజిల్లా), 18 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయ, వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 124వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు నుంచి ప్రారంభమవుతుంది. పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ‌కృష్ణాజిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను‌ ఈ విషయం తెలిపారు. అక్కడి నుంచి పల్లాంపల్లి వరకు పాదయాత్ర సాగిన తరువాత మధ్యాహ్న భోజన విరామం ఉంటుందని వారు పేర్కొన్నారు. భోజన విరామం అనంతరం ఆమె దాములూరు, కొణతమాత్కూరు వరకు పాదయాత్ర చేస్తారు. అనంతరం శ్రీమతి షర్మిల గురువారం రాత్రి బసకు చేరుకుంటరని వారు చెప్పారు. గురువారం మొత్తం ఆమె 14.1 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
Back to Top