తెలుగుదేశంది పిల్లి మొగ్గలు


హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ పిల్లి మొగ్గలు వేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం నేతలు తలో ఒక రకంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. ఇది ఒక రకంగా మభ్యపెట్టడం మాత్రమే అని పద్మ అన్నారు. తెలుగుదేశం నాయకులు తాము చేస్తున్న మోసాల్ని కప్పి పుచ్చుకొనేందుకు, కవర్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన రూపంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు మాత్రమే కాదని, అది ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం అని ఆమె అన్నారు.


తాజా ఫోటోలు

Back to Top