అవినీతిని ప్ర‌శ్నిస్తే అంత‌టి అస‌హ‌న‌మా..

హైదరాబాద్)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారని
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లో మాదిరిగా ఒక ఛానల్, పత్రిక చూడొద్దని చంద్రబాబు ఫత్వా జారీ
చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఇసుక మాఫియాపై అన్ని మీడియాల్లో
కథనాలు వచ్చాయని, హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని వాసిరెడ్డి పద్మ
గుర్తుచేశారు. మీ అవినీతిని ప్రశ్నించడం సాక్షి చేసిన తప్పా? అని ఆమె
చంద్రబాబును నిలదీశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ సీపీ ప్రధాన
కార్యాలయంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. జర్నలిజాన్ని పెయిడ్
జర్నలిజంగా దిగజార్చింది చంద్రబాబేనని ఆమె విమర్శించారు. మీడియాపై
చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Back to Top