పచ్చసర్కార్ వందల కోట్లు లూటీ

సాగునీటి ప్రాజెక్ట్ ల పేరుతో  దందా..
కొద్దిపాటి పనుల కోసం భారీగా దోపిడీ
బినామీ కాంట్రాక్ట్ ల కోసం వందల కోట్ల అవినీతి

హైదరాబాద్ః
సాగునీటి ప్రాజెక్ట్ పనుల పేరుతో చంద్రబాబు వందల కోట్ల రూపాయలు లూటీ
చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తయిన 90 శాతం
ప్రాజెక్ట్ పనుల కోసం ...చంద్రబాబు విచ్చలవిడీగా దోపిడీకి పాల్పడుతున్నారని
విమర్శించారు. అడ్డగోలుగా అంచనాలు పెంచేసి సొంత మనుషులకు కోట్లాది రూపాయలు
కాంట్రాక్ట్ లు కట్టబెడుతూ... దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు.
చంద్రబాబు చేస్తున్న దందాను అధికారులు సైతం తప్పుబడుతున్నారని, ప్రాజెక్ట్ ల
పేరుతో సాగుతున్న లూటీని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రభుత్వానికి లేఖ
రాశారంటే రాష్ట్రంలో పరిపాలన ఎంత దుర్మార్గంగా సాగుతుందో
అర్థమవుతుందన్నారు. 

బినామీల కోసం..
సింగిల్
టెండర్ తో చంద్రబాబు బినామీ కాంట్రాక్టర్లకు, అనుచరులకు కాంట్రాక్ట్ పనులు
అప్పగిస్తున్నారని పద్మ ఆరోపించారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, పోలవరం,
పట్టిసీమ ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ రాష్ట్రం నెత్తిమీద
కుచ్చుటోపీ పెడుతున్నారన్నారు. 18 నెలల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల
టెండర్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేనిపక్షంలో
శ్వేతపత్రం విడుదల చేయాలని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చంద్రబాబు వాల్మార్టుకు, ప్రపంచ బ్యాంకుకు ముద్దుబిడ్డగా మారారని
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్లెల్లోకి వాల్మార్ట్ తీసుకొచ్చి గ్రామాలను
నాశనం చేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. 
 
విచ్చలవిడిగా దోపిడీ...
హంద్రీనీవాకు
సంబంధించి రూ.194 కోట్లు వ్యయం ఉన్న పనులను 580 కోట్లకు పెంచేశారు. గాలేరు
నగరికి సంబంధించిన  12 కోట్ల పనిని, రూ.110 కోట్లకు పెంచేసి టీడీపీ ఎంపీ
సీఎం రమేష్ సంస్థకు ధారాదత్తం చేశారు. 35 కోట్లు అడ్వాన్స్ లు ఇచ్చేశారని
పద్మ మండిపడ్డారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి ఆర్కే ఇన్ ఫ్రాకు
413 కోట్లు కట్టబెట్టారని నిప్పులు చెరిగారు. కమీషన్లు, ముడుపుల కోసం
పట్టిసీమను తెరపైకి తెచ్చి....500 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.
పోలవరాన్నితామే కడతామని కేంద్రమే ముందుకొస్తే దాని గురించి
అడగకపోగా...కేంద్రం చేస్తున్న పనులకు అడ్డుపడుతోందని టీడీపీ ప్రభుత్వంపై
ధ్వజమెత్తారు. చేసేవన్నీ చేస్తూ అవినీతి బండారం బయటపడేసరికి  ఆనెపం
అధికారుల మీదికి నెడుతున్నారని ఫైరయ్యారు.   
Back to Top