మరోచీకటి ఒప్పందానికి చంద్రబాబు కుట్ర

హోదా ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచేందుకు యత్నం
ప్యాకేజీ మాదిరిగా కేంద్రంతో చంద్రబాబు మరో డీల్‌!
బాబు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న ప్రతీది ప్రజలకు చెప్పాలి
తెలంగాణలో పొత్తులపై మోత్కుపల్లితో ప్రెస్‌మీట్‌ డ్రామా
ఓటుకు కోట్ల కేసులో కేసీఆర్‌కు దాసోహమని నీటి సాధనలో మౌనం
40 ఇయర్స్‌ ఇండస్ట్రీ సాధించిన ఘనతలు సిగ్గుచేటు
హైదరాబాద్‌: కేంద్రంతో మరో చీకటి ఒప్పందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం పోలవరం తీసుకొచ్చిన చంద్రబాబు మరో కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారని, మార్చి 5న ఢిల్లీలో పార్లమెంట్‌ స్ట్రీట్‌లోని శంషద్‌మార్గ్‌లో ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. ఈ రోజు విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలు, మద్దతుదారులు బయల్దేరి వెళ్లనున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరి అని కేంద్రానికి గుర్తు చేయనున్నామన్నారు. రేపు ఎమ్మెల్యేలు, ఎంపీల వాహనాలను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. 
ఆ మాటల వెనుక ఆంతర్యమేంటీ?
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వెన్నుపోటు పొడించేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సాయం అనే పేరుతో ఏ ఫార్ములాను అంగీకరించబోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇదే చంద్రబాబు 2016 సెప్టెంబర్‌ 7వ తేదీన అర్ధరాత్రి చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్యాకేజీకి అంగీకరించారని గుర్తు చేశారు. మళ్లీ ఈ రోజున ప్యాకేజీ, సాయం పేరుతో కేంద్రం ముందుకు వచ్చిందనే మాటల వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్యాకేజీ పేరుతో పోలవరం హోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం పోలవరం తీసుకున్నట్లుగా మళ్లీ అదే రకమైన డీల్‌ కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. 
కమీషన్ల కోసం ఏపీని తాకట్టుపెట్టేందుకు సిద్ధపడుతున్న బాబు
వైయస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామాలకు, అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడడంతో చంద్రబాబుకు ఒత్తిడి పెరిగి హోదా అడుగుతాడనుకుంటే రెండు రోజులు తిరగకుండానే మాట మార్చాడని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మళ్లీ ప్రత్యేక హోదాతో ఏం వస్తుందని బుకాయించడం మొదలు పెట్టాడన్నారు. కేంద్రంతో చీకటి ఒప్పందం కుదుర్చుకునేందుకు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. కేసులు, కమీషన్ల కోసం ఏపీని తాకట్టుపెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ ఒప్పందాలకు సిద్ధపడుతున్నారో ప్రతీది ప్రజలకు చెప్పి చేయాలని సూచించారు. నాలుగేళ్లుగా ఏపీని మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణలో పొత్తులకు ఎవరితోనైనా సిద్ధపడతారని మోత్కుపల్లి నర్సింహులుతో ప్రెస్‌మీట్‌ డ్రామా నడిపించారని, ఓటుకు కోట్ల కేసులో మూటలు తెచ్చిన రేవంత్‌రెడ్డి పాపాత్ముడని, డబ్బు మూటలు పంపిన చంద్రబాబు పుణ్యాత్ముడిలా చెప్పించుకుంటున్నాడన్నారు. ఓటుకు కోట్ల కేసులో టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు దాసోహం అయ్యారని, అనుమతులు లేకుండా తెలంగాణ సర్కార్‌ ప్రాజెక్టులు కడుతున్నా నోరుమెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాలుగేళ్లలో మంచి ఘనతలు సాధించారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ సాధించిన గొప్పులు....
1. మహిళల అక్రమ రవాణాలో ఏపీ 2వ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి రిపోర్టు ఇచ్చింది. రాజధాని సమీపంలోని గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా మహిళలను వ్యభిచార కూపంలోకి తోసేస్తున్నారు. 
2. నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ అని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు.
3. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదే.
4. దేశంలోని అన్ని రాష్టాల్లో కల్లా రైతులు అప్పుల్లో మగ్గుతున్న రాష్ట్రం ఏపీనే. 
5. అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని ఎన్‌సీఏఈఆర్‌ చేసిన సర్వేలో వెల్లడైంది. 
6. రోడ్డు, అనేక ప్రమాదాల్లో ఏపీనే టాప్‌
7. పొగతాగడంలో ఆంధ్రప్రదేశ్‌ది 4వ స్థానం. 
8. దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబేనని ఏడీఆర్‌ రిపోర్టు ఇచ్చింది.
ఇవి దేశంలో అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేత చంద్రబాబు సాధించిన ఘనతలని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నారని కేసును చంద్రబాబు నీరుగార్చాడని పద్మ మండిపడ్డారు. పోలవరంపై డాక్యుమెంటరీ తీసేందుకు నేషనల్‌ జియోగ్రఫీ ఛానల్‌కు రూ. 75 లక్షలు జారీ చేశారని చెప్పారు. గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ పిచ్చితోనే 29 మందిని చంద్రబాబు బలితీసుకున్నాడన్నారు. 
 
Back to Top