రాజకీయంగా ఎదుర్కోలేక పైశాచిక ఆనందం

మారిషస్‌ లేఖలో వైయస్‌ జగన్‌ పేరుందంటూ టీడీపీ డ్రామాలు
హోదా విషయాన్ని డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు కుట్రలు
టీడీపీ ఆరోపణలను పూర్తిగా ఖండించిన వైయస్‌ఆర్‌ సీపీ
ఏపీ పరువును అంతర్జాతీయంగా తీసిన ఘనుడు చంద్రబాబే
టీడీపీ అవినీతి తట్టుకోలేక ప్రధానికి ఫిర్యాదు చేసిన జపాన్‌ కంపెనీ
ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన బాబుకు ఏ శిక్ష వేయాలి
హోదా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు కుయుక్తులు
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, ఆయన మంత్రులు తప్పుడు ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మారిషస్‌ కంపెనీ వైయస్‌ జగన్‌పై ప్రధానికి, కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేసిందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారిషన్‌ దేశంలోని ఒక కంపెనీ ఇక్కడి హిందూటెక్‌ అనే కంపెనీతో కలిసి ఒక ప్రాజెక్టు చేపట్టిందని, ఆ పనులు ఆగిపోవడంతో మారిషస్‌ కంపెనీకి నష్టం వస్తుందని ఆ పంచాయతీ తేల్చాలని ప్రధానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసిన వైయస్‌ జగన్‌పై నిందలు వేసేందుకు చంద్రబాబు ఇలాంటి వికృత క్రీడలకు పూనుకున్నాడని ధ్వజమెత్తారు.
 
అంతర్జాతీయంగా ఆంధ్రరాష్ట్ర పరువును తీసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు, టీడీపీ మంత్రుల అవినీతిని తట్టుకోలేకపోతున్నామని జపాన్‌కు చెందిన మాకీ సంస్థ ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రబాబు తన అవినీతితో నూతన రాజధాని పరువును అంతర్జాతీయంగా తీశారన్నారు. ప్రజాధరణ పొందుతున్న వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పూనుకున్నాడన్నారు. గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై అక్రమంగా కేసులు పెట్టించారని గుర్తు చేశారు. చంద్రబాబు వికృత చేష్టలు చూసిన దేశాలు ఆంధ్రరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నాయన్నారు. 

వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదాను సాధించేందుకు అనేక ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు చేస్తే చంద్రబాబు పోలీసులతో పోరాటాన్ని అణచివేయించారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హోదా వదులుకుంటే ఏపీకి అంతకు మించిన నష్టం లేదని వైయస్‌ జగన్‌ మాట్లాడితే.. హోదా గురించి అవగాహన లేనివారంతా మాట్లాడుతున్నారన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ నంగినంగి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ హోదా అంటూ పిల్లలను చెడగొడుతున్నారు.. హోదా అంటే జైలుకు పంపిస్తానని చంద్రబాబు బెదిరింపులకు దిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల విషయంలో మోసం చేసినందుకు మీకు ఎలాంటి శిక్ష విధించాలి చంద్రబాబూ అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదాను అడగకపోతే జనం తంతారనే భయంతో తెరచాటుగా హోదా అంటే మాట్లాడుతున్నారన్నారని, హోదా ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు మారుతాడని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 
 
Back to Top