దమ్ముంటే చంద్ర‌బాబు రాజీనామా చేయాలి


పశ్చిమ గోదావరి జిల్లా : దమ్మంటే ఉప ఎన్నికలను ప్రత్యేక హోదా రిఫెరెండమ్‌గా భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ  సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం 14 నెలల ముందే ఎంపీ పదవులను తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడింది ఒక్క వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీయేనని ఆమె పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే బంపర్‌ మోజార్టీతో తమ ఎంపీలు గెలుపొందుతారని ధీమా వ్య‌క్తం చేశారు.   వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించిన సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ అస్త్రంగా ఎంపీలు రాజీనామా చేస్తారని రెండేళ్ల కిందనే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉండబట్టే లోక్‌సభ స్పీకర్‌ను పదే పదే కలిసి తమ నాయకులు రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారని తెలిపారు.  ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులు వదులుకునేందుకు తమ పార్టీ నాయకులు చేసిన రాజీనామాలను చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఆయనకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్న చంద్రబాబు హోదాను నీరుగార్చింది నిజం కాదా అని​ ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీల రాజీనామా ఆమోదం తర్వాతనైన చంద్రబాబు సిగ్గుపడి వారి పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని సూచించారు.   

Back to Top